Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaritho Nee Jeevitham - Endaaka Nee Payanam

ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం

Evaritho Nee Jeevitham - Endaaka Nee Payanam

Verse
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు‖ 2x ‖
Verse
దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం‖ 2x ఎవరితో ‖
Verse
కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం‖ 2x ఎవరితో ‖
Verse
గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం‖ 2x ఎవరితో ‖

Related Tags

FaithLifePurpose