Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaro Telusa Yesayya Chebutha Nedu Vinavayya

ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా

Evaro Telusa Yesayya Chebutha Nedu Vinavayya

Verse
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా
Verse
దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే
Verse
ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే
Verse
పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో
Verse
యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా
నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా
Verse
యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై
అతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్

Related Tags

GospelSalvationJesus