Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaro Thelusaa Yesayyaa

ఎవరో తెలుసా యేసయ్యా

Evaro Thelusaa Yesayyaa

Lyricist: Songs Of Zion
Verse
ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా‖ 2x ‖
Verse
దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా‖ 2x ‖
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై‖ 2x ఎవరో ‖
Verse
ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా‖ 2x ‖
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై‖ 2x ఎవరో ‖
Verse
పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై‖ 2x ‖
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో‖ 2x ఎవరో ‖
Verse
యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా‖ 2x ‖
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా‖ 2x ఎవరో ‖
Verse
యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై‖ 2x ‖
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని‖ 2x ఎవరో ‖

Related Tags

GospelRepentanceSalvation