Chorus
ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు
బోధ చెవులొగ్గి వినువారికన్న‖ నెవరు ‖
Verse
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ
బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న‖ నెవరు ‖
Verse
దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము
వారి దౌనటంచు ప్రభువు తెల్పె‖ నెవరు ‖
Verse
వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ
బొంది నిత్య సంతోషింతు లని తెల్పె‖ నెవరు ‖
Verse
శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది
దయఁ బడసెద రని ప్రభువు తెల్పె‖ నెవరు ‖
Verse
పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల
సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు‖ నెవరు ‖
Verse
నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక
రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు‖ నెవరు ‖