Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaru Jayinchedaro Vaare Samasthamunu Pondhedaru

ఎవరు జయించెదరో వారే సమస్తమును పొందెదరు

Evaru Jayinchedaro Vaare Samasthamunu Pondhedaru

Verse
జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన 21:7
Chorus
ఎవరు జయించెదరో
వారే సమస్తమును పొందెదరు
Verse
ఎవరు కష్ట బాధ లోర్చెదరో
పట్టువదలక ప్రభుతో నుండు వారే
దిట్టముగా నత్యధిక విజయమును పొంది
గట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో
Verse
ఎవరు శోధనలను జయింతురో
జీవమకుటము వారే పొందెదరు
పావనుడైన పరమ క్రీస్తేసు తోడ
పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో
Verse
ఎవరు లోకాశలను జయింతురో
వారే సైతానును ఓడింతురు
పరిపూర్ణముగా ప్రభుని బలము గలవారై
పరలోక స్వాస్థ్యమును పొందెదరు
Verse
ఎవరు క్రీస్తేసు సంబంధులో
వారే పాప మరణము జయింతురు
ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు
వీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై
Verse
ఎవరు ప్రభు సేవను చేసెదరో
వారే పొందెదరు బహుమానము
ఓరిమి కలిగి పరుగును ముగించి
మురిసెదరు హల్లెలూయ పాటలతో

Related Tags

VictoryPromise