Verse
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా‖ 2x ‖
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే‖ 2x ‖
ఏమౌదునో నేనేమౌదునో‖ 2x ‖
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి‖ 2x ‖
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ‖ 2x ఏమౌదునో ‖
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి‖ 2x ‖
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ‖ 2x ఏమౌదునో ‖
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా‖ 2x ‖
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ‖ 2x ఏమౌదునో ‖