Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaru Unnaa Lekunnaa

ఎవరు ఉన్నా లేకున్నా

Evaru Unnaa Lekunnaa

Verse
ఎవరు ఉన్నా లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు‖ 2x ‖
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు‖ 2x ఎవరు ‖
Verse
కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు‖ 2x ‖
ఆపదొచ్చినా అపాయమొచ్చినా‖ 2x ‖
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు‖ 2x అందరి ‖
Verse
తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు‖ 2x ‖
ముదిమి వచ్చినా తల నెరిసినా‖ 2x ‖
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు‖ 2x అందరి ‖
Verse
అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు‖ 2x ‖
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా‖ 2x ‖
రెక్కలు చాపి నన్ను కాపాడును‖ 2x అందరి ‖

Related Tags

FaithDevotionalJesus