Verse 1
నీవున్నావని ఒకే ఆశ
నడిపిస్తావని ఒకే ఆశ
Verse
ఎవరున్నారు నాకిలలో‖ 2x ‖
నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకు యేసయ్యా
ఎవరున్నారయ్యా
నీవున్నావని ఒకే ఆశతో
నడిపిస్తావని ఒకే ఆశలో‖ 2x ‖
ఆదరిస్తావని ఆదుకుంటావని‖ 2x ‖
అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా
Verse
ఆశలే అడి ఆశలై
బ్రతుకెంతో భారమై‖ 2x ‖
కలలన్ని కన్నీటి వ్యధలై
గుండెను పిండే దుఃఖమున్నా‖ నీవున్నావని ‖
Verse
ఆప్తులే దూరమై
బంధు మిత్రులకు భారమై‖ 2x ‖
నా అన్న వారే నాకు కరువై
గుండెను పిండే దుఃఖమున్నా‖ నీవున్నావని ‖
Verse
యాత్రలో తుఫానులే
నా నావనే ముంచేసినా‖ 2x ‖
అద్దరి చేరే ఆశలే అనగారినా
గుండెను పిండే దుఃఖమున్నా‖ నీవున్నావని ‖