Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evvani Athikramamulu Mannimpabadeno

ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో

Evvani Athikramamulu Mannimpabadeno

Verse
ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో
పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు
Verse
యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు
Verse
మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను
Verse
దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె
Verse
నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని
Verse
నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా
Verse
కావున నీ దర్శన కాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు
Verse
విస్తార జలప్రవాహములు పొర్లినను
నిశ్చయముగా నవి వారి మీదికి రావు
Verse
నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి
నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా
Verse
విమోచన గానములతో నీవు నన్ను
ఆవరించి నాకుపదేశము చేసెదవు

Related Tags

RepentancePsalmForgiveness