Verse
ఏ సమయమైన ఏ స్థలమందైన
విడువక నాకై చూపిన నీ ప్రేమే శాశ్వతం
విడువక నాకై చూపిన నీ కృపయే అద్భుతం
ఆరాధన ఆరాధన
హల్లేలూయా హల్లేలూయా
యాకోబు వలే నేను మొసగాడైన
ఇశ్రాయేలుగా మార్చిన నీ ప్రేమ
పేతురు వలే పలుమారులు బొంకినను
వేల ప్రజలముందు నిలబెట్టితివే
హన్నా వలే యేడ్చినా
దయతో కుమారునే ఇచ్చితివే
యోబు వలే కొల్పోయినా
రెండంతులుగా ఇచ్చితివే
సొంతవారే నన్ను అమ్మేసినా
పొరుగువారే పొమ్మన్నా
చాలయ్యా నీ ప్రేమ
ఎవరున్నా లేకున్నా