Verse 1
హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||
Verse 2
పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)
కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)
తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)
పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
Verse 3
బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)
అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)
కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)
పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
Verse 4
రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||