Verse 1
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి - వేగమె రానుండె || గగనము ||
Verse 2
పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
ధర సంఘ వధువునకై - తరలెను వరుడదిగో ||గగనము ||
Verse 3
మొదటగను గొఱ్ఱెగను - ముదమారగ వచ్చేను
కొదమ సింహపురీతి - కదలెను గర్జనతో ||గగనము ||
Verse 4
కనిపెట్టు భక్తాళి - నురెప్పలో మారెదరు
ప్రధమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము ||
Verse 5
ఆకాశ మధ్యమున - ప్రకాశ మానుండై
లోకాన రారాజై - శోకము తొలగించు ||గగనము ||