క్రీస్తుని సర్వము విందును - ప్రభువే పలికినపుడు
మధుర స్వరమెయది - మెల్లని స్వరమేయది
యెహోవ నీ స్వరము - జలములపై వినబడెను
మహిమగల దేవుడు - ఉరుము వలె గర్జించెను ||క్రీస్తుని ||
బలమైన నీ స్వరము - బహు ప్రభావము గలది
దేవదారుల విరుచును - ప్రజల్వింపచేయు నగ్నిని ||క్రీస్తుని ||
అద్భుత ప్రభు స్వరము - అరణ్యమును కదిలించును
ఆకుల రాలజేయును - లేళ్ళనీనజేయును ||క్రీస్తుని ||
ఆలయమందన్నియు - ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదములు శాంతి - నొసగునాయనస్వరమే ||క్రీస్తుని ||
నీ మధుర స్వరము - నీ వాక్యమున విందున్
ప్రార్ధనల యందున - ప్రతిదినము పల్కెదవు ||క్రీస్తుని ||
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో - అనుకరించెద నిన్ను ||క్రీస్తుని ||
నీ మధుర స్వరము - నీ మార్గము జూపును
కుడి ఎడమల దిరిగినను - నీ స్వరమే వినబడును ||క్రీస్తుని ||
తుఫానులు కలిగి - భయభీతులతో నుండ
భయపడకుమని పలికె - ప్రేమగల నీ స్వరము ||క్రీస్తుని ||