Verse 1
నమ్మదగిన దేవా నా..... నమ్మదగిన దేవా
జీవనయాత్రలో అన్నివేళలా
నీసన్నిధి నాతోడుగనుంచి - కన్నతండ్రిగా ఆదరించే
Verse 2
పరిశుద్ధతలో పరిపూర్ణతకై - అనుమతించిన శ్రమలన్నిటిలో - 2
విసుగక నిత్యము ప్రార్ధించెను - విజయమునిచ్చి నడిపించుమయా ||నమ్మ ||
Verse 3
విడువను ఎన్నడు ఎడబాయనని - అభయము నిచ్చిన ఘన దేవుడవు - 2
భయపడను నే ఏమాత్రమును - నరమాత్రుడు నాకేమి చేయును ||నమ్మ ||
Verse 4
అలసిన హృదయము బలపరచుమయా - నీ ప్రతినిధిగా నే నిలుచుటకై - 2
శోధనను సహించి భువిలో - జీవముగల నీనామము చాటెద ||నమ్మ ||