Verse 1
నామదిలో మ్రోగెను సితారలు
నా హృదయం పాడెను కృతజ్ఞతలు
ప్రభుప్రేమను తలపోయుచూ ||2||
నా యేసుని కృపను తలంచుచూ
Verse 2
నూతన వత్సర దయాకిరీటం నాతలపైన ఉంచావు
నీ కృప నాపై చూపావు నను కరుణించావు -2
Verse 3
మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా
మరణపు ముల్లును విరిచిన క్రీస్తు -2
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
సతతము నిన్నే సర్మియింతునయ్యా -2 ||నామదిలో ||
Verse 4
నిను మరువనయ్యా నిర్మల హృదయా
నిను విడువనయ్యా అడుగడుగునయ్యా -2
బ్రతికినను నీకొరకే తండ్రి
మరణించిన నీకొరకే దేవా -2 ||నామదిలో ||