Verse 1
గళమెత్తి పాడినా స్వరమాలపించినా
నీ గానమే యేసు - నీ కోసమే
నీ ధ్యానమే యేసు - నీ కోసమే
Verse 2
నశియించిపోయే నన్ను బ్రతికించినావె
కృశియించిపోయే నాలో వశియించినావె
నీ కార్యము వివరించెదన్ - నీ నామము హెచ్చించెదన్
నాకున్న సర్వమా ఏకైక దైవమా ||గళమెత్తి ||
Verse 3
మతిలేక తిరిగే నన్ను సరిచేసినావె
గతిలేని నా బ్రతుకునకు గురిచూపినావె
నీలో అతిశయించెదన్ నీలో ఆనందించెదన్ ||నాకున్న ||
Verse 4
శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావె
కృపచేత ఆపద నుండి విడిపించినావె
నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్ ||నాకున్న ||