నా ప్రాణమునకు సేదను దీర్చి - నా అలుపును బాపుము దేవా
నా అలసటను దీర్చుము దేవా - (ఈ) అల్పుని బలపరచుము - 2
నీ పవిత్రతకు శతృత్వం - విశ్రాంతిలేదు ఏమాత్రం
వెలుపట పోరాటములు - లోపట భయకంపములు
అపార్ధములు అపోహలు - అపనిందలు అభాండములు
దురవగాహన దూషణల మధ్యన కావాలి ఆదరణ నీ నిత్య ఆదరణ ||నా ||
సువార్త సేవ అనివార్యము - అది నీవిచ్చిన నా భాగ్యము
సహృదయం కల్గినట్టి - సహచర్యము అవసరము
ఆవేశం ఆందోళన ఆవేదన హృదయాన
ఆత్మశక్తితో అభిషేకముతో అనుగ్రహించు సమాధానము నీ నిత్య సమాధానము ||నా ||
స్వశక్తిచేత ఈ యాత్ర సాగించుట అసాధ్యము
నీ శక్తిగల హస్తముతో పట్టుకొని నడుపుము
నీ దర్శన వెలుగులో ధైర్యము దయచేయుము
నీ సన్నిధిలో ఈ జీవితం తరించే కృపనీయుము తరించే కృప నీయుము
పద్యం:ఎన్నికలేని నాకిల నీ సన్నిధి నిచ్చి - నమ్మకమైన నీవార్త నప్పగించి
ఎచటి కేగిన నిన్నావరించియుందునని ఆనతి నిచ్చితివి
వక్తలెందరో వసించు ఈపాప జగతినందు
ఎట్లు ప్రకటించ గలాడనయ్యా నీ ఆత్మశక్తిలేక