Verse 1
పాడాలి పాడాలి యేసుపాట
అది నీతి విమోచనల కృపలపాట
ఈలోకానికే మంచిపాట - మననోట నుంచిన క్రొత్తపాట
Verse 2
నీతి న్యాయములకు నిలయము నా ప్రభువు
వాటి కొరకు ఆకలి దప్పులు నా కిచ్చెను
తన నీతి బాటలో నను నిల్పెను
తన న్యాయ విధులను నాకు నేర్పెను ||పాడాలి ||
Verse 3
పాపములో శాపముతో మృతుడనై నేనుండగా
సహనముతో నా దోషము సిలువలో సహియించెను
పాతాళము నుండి నన్ను విడిపించెను
మరణము నుండి నన్ను రక్షించెను ||పాడాలి ||
Verse 4
నా నీతిని బట్టి ఈ రక్షణ రాలేదు
నా గొప్పతనమును బట్టి ఇది నాకు దొరకలేదు
కేవలము నా యేసుని కృపాకనికరమ్ములే
నన్ను రక్షించెను నన్ను విమోచించెను ||పాడాలి ||