Verse 1
రండి రండి వెలుగుసంబంధులు - చీకటిలో ఎందుకండి చిందులు
యేసు సన్నిధికాంతి ఆశించండి - ఆత్మ దీపాలను వెలిగించండి
Verse 2
లోకాన వెలుగు చెలుగుచుండెను - చీకటి దానినెరుగకుండెను
అందులోన ఉన్నవారు అందరు కన్నులుండి చూడలేని అంధులు ||రండి ||
Verse 3
చీకటిలో కాచెడి చోరులు - చీకటిపై లేచేది జారులు
చీకటిలో తీసేవి గోతులు - చీకటిలో పొందేవి చింతలు ||రండి ||
Verse 4
అమావాస్యకన్న ఘోరచీకటి అంతరంగమందు పాపచీకటి
ఎరుగకుంది నిజమైన వెలుగును లోకమందు ప్రకాశించు క్రీస్తును ||రండి ||
Verse 5
వేకువనే వేనవేలు లక్షలు ప్రభువుని స్తుతించు పక్షులు
వాటికంటె నరులెంతో శ్రేష్టులు పొందండి దేవుని అభీష్ఠులు ||రండి ||
Verse 6
అంధకార సంబంధులు అందరు వెలుపట చీకటిలోన ఉందురు
వెలుగు సంబంధులు అందరు - మహిమ తేజాన వెలుగుచుందురు ||రండి ||