Verse 1
ప్రేమ యేసుని ప్రేమ - ప్రేమ కలువరి ప్రేమ
మార్పులేనిది మారిపోనిది - వాడిపోనిది, వీడిపోనిది
కను పాపలా - ననుకావగా ||2||
నా కోసమొచ్చిన - నా భారం మోసిన శిలువ ప్రేమ
Verse 2
నా పాప ఫలముగా - మరణపాతృడనవగా
నాకు బదులుగా - పరిహార మవ్వగా
తన రుధిరము నిచ్చిన - శ్రేష్ఠ ప్రేమ
ప్రాణమునర్పించిన విలువైన ప్రేమ || 2 || ||ప్రేమ ||
Verse 3
అవివేక పరునిగా - దారితొలగి యుండగా
నా త్రోవకు తన వెలుగు చూపగా
నరరూపము దాల్చిన క్రీస్తు ప్రేమ
అనుక్షణమూ శ్రద్ధ చూపు నిత్యప్రేమ || 2 || ||ప్రేమ ||