Verse 1
తేజోమయా యేసయ్యా - స్తుతి పాత్రుడవు నీవయ్యా
Verse 2
నిజమైన దేవా నీవంటివాడు లేడు
మహాత్మ్యము గల నిన్ను పోలినవాడెవడు
నీ నామము ఘనమైనదయా - నరులు నీకు భయపడెదరయా
Verse 3
జనములకు రాజా జీవముగలిగిన నాథా
సమస్తము నిర్మించినవాడవు నీవెగదా
నీ ఉగ్రత తాళలేమయా - మేలు చేయగలవు నీవయా
Verse 4
మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా