Verse 1
యెహోవా మీద క్రొత్తపాట పాడుడి - ఆయన కృపలన్నీ తలపోయుడి
స్తుతి చేయుడి కొనియాడుడి - ఆనంద గీతము ఆలపించుడి
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ || యెహోవా ||
Verse 2
అతిక్రమ పరిహారం యేసేయని - మన పాపాలకు ప్రాయశ్చిత్తమేసేయని
నూతన బలమిచ్చిన నీతి రాజని
విమోచన గానముతో ( నన్ను నింపినాడని ) - 4 ||హల్లేలూయ ||
Verse 3
బ్రతుకు మార్చి దరికి చేర్చినాడని - బ్రతుకు గతుకులన్ని కడతేర్చినాడని
సత్యమును గుర్తింప జేసినాడని
నిత్యము నన్ను ( విడువనన్నవాడని ) - 4 ||హల్లేలూయ ||
Verse 4
ప్రార్ధనా వీరులై నిలవండి - నిజదేవుని శక్తిని పొందండి
అపవాది తంత్రమును ఎదిరించండి
క్రీస్తునందు అన్నిటిలో ( విజయ మొందండి ) - 4 ||హల్లేలూయ ||