Verse 1
ఆకాశమా ఆలకించుమా - భూమీ చెవి యొగ్గుము
ఎద్దు ఎరుగును తన కామందును
గాడి దెరుగును సొంత వాని దొడ్డిని
నా ప్రజలు నా మీద తిరుగబడితిరే
ఇప్పుడైన తెలివితో యోచింపరే ||ఆకాశమా||
Verse 2
ఒక్కడైన లోకంలో నీతిమంతుడే లేడు
ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు
అందరి గుండెలు బలహీనమాయెను
పిరికి వారు కాక మీరు పోరాటంచేయుడి ||ఆకాశమా ||
Verse 3
తిరుగుబాటు చేసి ఏల కొట్టబడుదురు
సాతానుమాట విని తొలగిపోదురు
ఇప్పుడైన యేసుమాట గౌరవించండి
శ్రమలనుండి ఆయనే తొలగించును రండి ||ఆకాశమా ||