Verse 1
ఆరాధన ఆత్మ ప్రేరేపణ స్తుతుల సంకీర్తన
దైవ సందర్శన - ఈ వేళ దైవ సందర్శన
Verse 2
విరిగిన హృదయావేదన నలిగిన మనస్సు ఆలాపన - 2
సజీవయాగ సమర్పణ ఆత్మతో ఆరాధన - 2
స్తుతుల సంకీర్తన దైవ సందర్శన - 2
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||ఆరాధన ||
Verse 3
దీనులమొరను ఆలించును - దీవెన వర్షము కురిపించును - 2
హృదయశుద్ధితో పరివర్తన - సత్యముతో ఆరాధన - 2
స్తుతుల సంకీర్తన దైవ సందర్శన - 2
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||ఆరాధన ||