Verse 1
దేవా ఈ జీవితం నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా... ఎన్ని నష్టాలైనా...
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా... శోక సంద్రమైనా...
నీతోనే నా జీవితం (2) ||దేవా||
Verse 2
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2) ||ఎన్ని||