Verse 1
నీవు చేసిన మేలులను - మరువ జాలను నా ప్రభువా
నీ నామమును కృతజ్ఞతతో స్మరియించెదము తరియించెదము
Verse 2
భీతి చెందిన వేళలందున - నీ సాయముకై నే మొరలిడగా
నా మనవులను మన్నించితివి - నీ తనయునిగా కాపాడితివి ||నీవు ||
Verse 3
దుష్టుల నుండి కాపాడితివి - వాక్కలహమును మాన్పిన ప్రభువా
నీ సన్నిధిలో నను దాచితివి - నీ శాంతిని నా కొసగిన దేవా ||నీవు ||
Verse 4
ప్రతి ఉదయమును సాయంత్రమును - అన్ని వేళల నిను నేజూడ
నీ సన్నిధియే నా పెన్నిధిగా - నీ పాదముల నే వ్రాలెదను ||నీవు ||