Verse 1
ఓ యన్నలారా నే విన్నవింతు నేడు - విన్నారా !
Verse 2
నరుడై లోకములోన బుట్టెను - నరులందరికి మేలు చేసెను
కరుణాకరుడని బిరుదు నొందినాడే - విన్నారా ! ||ఓ యన్నలార ||
Verse 3
పాపులను ప్రేమించినవాడు - పాపమును ద్వేషించినవాడు
యేసు కాక మరి వేరే లేరయ్యా ||ఓ యన్నలార ||
Verse 4
నాయీనను ఒక ఊరినందున - పేదరాలి కొడుకు ఒకడు చచ్చెను
మోసేవారు మోయుచుండిరి - పాడెముట్టి ప్రభు యేసు లేపినాడే విన్నారా! ||ఓ ||
Verse 5
ఐదు రొట్టెలు రెండు చేపలను - ఐదువేలమంది కాహార మిచ్చెను
ముక్కలు పన్నెండు గంపలెత్తినారే విన్నారా ! ||ఓ యన్నలార ||
Verse 6
పాపాత్మురాలు పావనుని చేరి - కన్నీటితో పాదాలు తడిపె
తన ప్రేమతో పాపాలు కడిగాడే విన్నారా ! ||ఓ యన్నలార ||
Verse 7
పరలోకమునకు ఎక్కిపోయెను - మరల వత్తునని మాట ఇచ్చెను
నమ్మిన వారికి మోక్షమిత్తుననెను - విన్నారా ! ||ఓ యన్నలార ||