Verse 1
నీ సిలువ మరణముతో
ఆ పునరుత్థానముతో యేసు - యేసూ - 2
విమోచించితివీ నీ బలమునింపితివి - 2
ఆరాధన ఆరాధన - ఆత్మతో సత్యములతో ఆరాధన
Verse 2
ఇంత ప్రేమకు హేతువేదియు లేదయా
వింతగా నా చింత బాపిన యేసయ్యా - 2
పరవశించిన హృదిని నీ యెదుట
పరచి భక్తితో ఆరాధించెదనయ్యా - యేసయ్యా
ఆరాధనా - ఆరాధనా - ఆత్మతో సత్యములతో ఆరాధన ||నీ సిలువ ||
Verse 3
మంచిలేని వంచకుడనై యుండగా
పంచితివి నీ మధుర ప్రేమను మెస్సయ్యా - 2
దివ్యమగు నీ చరణముల చెంత
ఆశ్రయుడనై ఆరాధించెదనయ్య యేసయ్యా ||ఆరాధన ||
Verse 4
కారుచీకటి కోరలలో నేనుండగా
వెలికితీసి వెలుగు నింపిన నాధుడా - 2
జగతిలో నే బ్రతుకు కాలమంత
స్వరమునెత్తి ఆరాధించెదనయా - యేసయ్యా ||ఆరాధన ||