Verse 1
హోసన్నా - హోసన్నా - హల్లెలూయ - 3
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
భువిపై తనకు ఇష్టులైన వారికెల్లరికి - 2
సమాధానము - 2 కలుగును గాక - 4 || హోసన్నా ||
Verse 2
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవునట్టి
మహా సంతోషకరమైన - సువర్తమానము - 3
నేడు రక్షకుడు - మీ కొరకుదయించె - 3 ||హోసన్నా ||
Verse 3
చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారికి
పాపమును మరణభీతిని తొలగించి విడిపించ
అరుణోదయ మాయె - 2
సూర్యుడుదయించె నీతి సూర్యుడుదయించె - 2 ||హోసన్నా ||