Verse 1
నా బలమా నా దుర్గమా నాకేడెమా
నీవు నాకుండగా నాకేమి కొదువ || 2 ||
Verse 2
నీ కృపయే నన్ను బలపరచెనే
నీప్రేమ నన్ను బ్రతికించెనే
నీ కౌగిలి నన్ను ఆదరించెను || 2 || ||నా బలమా ||
Verse 3
నీ వాక్యమే నన్ను స్థిరపరచెనే
నీ ఆత్మ నన్ను నడిపించెను
నీ జీవము నన్ను నీలో నిలిపెను || 2 || ||నా బలమా ||
Verse 4
ఏమంచి లేని నన్ను ప్రేమించావు
నా ఆశా దీపమై నీవున్నావు
యేసయ్యా నీరుణం తీర్చలేనయ్యా || 2 || ||నా బలమా ||