Verse 1
ఆశీర్వాదము - శాశ్వత జీవము
నీ యందే - నిరతం - కనుగొంటిమయా
నీవు దీవించు నరులే ధన్యులని
నిన్ను ముదమార హెచ్చించి కొనియాడనీ
Verse 2
అబ్రాహామును దీవించీ - సంపన్నునిగా చేశావు
యోసేపును దీవించీ - సింహాసనమును ఇచ్చావు
యోబును దీవించి - సిరులను రెట్టింపుచేశావు
నిన్నాశ్రయించీ - జీవించు వారికి
మెండైన సంపదలు అందింతువు ||ఆశీర్వాదము ||
Verse 3
హిజ్కియాను దీవించీ ఆయుష్కాలమునిచ్చావు
సొలోమోనును దీవించీ - జ్ఞాన వివేకములిచ్చావు
దావీదున్ దీవించీ - సింహాసనమును ఇచ్చావు
నినువెంబడించీ ప్రార్థించువారికి హెచ్చైన ఆశీస్సులందింతువు ||ఆశీర్వాదము ||