Verse 1
నా దేవ నీదు నివాసములు - నారాజ నీ సహవాసములు
పరికించుచున్నవి ఆత్మ నేత్రాలు - నీ దివ్య మహిమ ప్రవేశములు
కాంక్షించుచున్నవి ప్రాణాత్మ దేహములు - నీ నిత్య జీవ జలధారలు
నా ప్రాణమెంతో తృష్ణగొను చున్నది - వినగోరి యేసుని ప్రియవాక్కులు || నా ||
Verse 2
నీ సంఘవధువుగా నను కోరినావా - నీ ప్రేమ నాపై చూపించినావా
నీ రాక కోసము నను సిద్ధపరచి - ప్రతి డాగుముడతలు సరిచేసి నావా
నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని - నా యేసు వేగమే దిగిరావయ్యా ||నా ||
Verse 3
నీ నామమే పరిమళ తైలతుల్యము - నీ ప్రేమయే తీయని ద్రాక్షపానము
అతిసుందరుండా అతికాంక్షనీయుడా - నీ విడిది గదిలో నేనుంటిని
నీకై వేచి యుంటిని నీకై చూచుచుంటిని - నా యేసు వేగమె దిగిరావయా ||నా ||