Verse 1
మరనాత గృహము నందు - దేవుని మహిమ దివ్వెలము
హల్లెలూయా మరనాత వారసులం
హల్లెలూయా మరనాత సైనికులం ||2||
Verse 2
క్రీస్తే మా మూలరాయి - మేమంతా జీవపు రాళ్లం
ఆధ్యాత్మిక మరనాత గృహమునందు
మెరుగు పరచిన ముత్యాల రాశులము ||హల్లెలూయ ||
Verse 3
మరనాత తోటయందు - పరిమళించు పుష్పాలము
ఆధ్యాత్మిక ఆరాధనకర్పించు - సుగంధ శ్రేష్టద్రవ్యములం ||హల్లెలూయ ||
Verse 4
మరనాత విశ్వాస జనులం - ఆధ్యాత్మిక సైనికులం
విజయ పతాక ధారులం
పరలోక రాజ్య మరనాత వారసులం ||హల్లెలూయ ||