Verse 1
ఒప్పింపచేయుము దేవా!
నా ప్రతి విధమైన పాపమును - దయతో ప్రేమను చూపి
పరిశుద్ధ పరచుము దేవా!
నీ పావన దివ్యరూపమును - నాలో పూర్తిగ నింపి
దోషమే లేని నీ రుధిరముతో - నిర్ధోషిగా మార్చే నీ వచనముతో
Verse 2
ఆపాద మస్తకం - మలినమైన జీవితం
పలుమార్లు దోష క్రియలతో - ప్రభూ నీకు తెచ్చితి దుఃఖం
అవధులు లేనిది నీ ప్రేమ-అపరిమితముగా చూపు క్షమ ||ఒప్పి ||
Verse 3
ఆదరణ ప్రేమలను - చూపలేని జీవితం
శ్రమల సుడులలోనే చిక్కి - మరచిపోతి నీ సహవాసం
హేతువులెంచని మేటి నృపా-ఒకపరి దయతో చూపు కృప ||పరి ||
Verse 4
ఆత్మలో నెమ్మది లేని - అస్థిరమగు జీవితం
అదుపులేని దుర్భాషలతో - ప్రతివారికి చేసితి గాయం
ఖలులను మార్చిన కరుణామయా - కనికరముంచి చూపు దయ
ప్రభుని ప్రేమ ||ఒప్పి ||