Verse 1
నీవే గానం నీవే ప్రాణం నీవే ధ్యానము
యేసు నీవే భాగ్యము - నాకు నీవే సర్వము - 2
శ్వాస విడిచే వరకు నీ సేవలో నుండెదను
ఆ ఆశతో నేను జీవించుచున్నాను
నిన్ను స్తుతియింతును నిన్ను కీర్తింతును
నీకై జీవింతును నీకై మరణింతును
నీకై పానార్పణముగా పోయబడుదును
Verse 2
నలిగిన వేళలలో - నన్ను వెలిగింపజేసితివి
విరిగిన సమయములో - నన్ను వికసింపజేసితివి - 2
ఇరుకులో నన్ను విశాలపరచి దీవెనలిచ్చితివి
అపాయములలో ఉపాయమై ఆవేదనలలో ఆశ్రయమై
నన్నాదరించితివి అద్దరి చేర్చితివి ||నీవే గానం ||
Verse 3
ఆత్మల భారముతో - నా హృదయము నింపుమయా
ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకించుమయా - 2
దైవావేశముతో నీ వాక్యము చాటింతును
కనికర హృదయముతో నీ ప్రేమను పంచెదను
ఆత్మాగ్నితో నను రగిలించుమా - ఆరని జ్వాలగ నను చేయుమా
కలనైన నిను విడువనయ్యా నా ప్రభువైన యేసయ్యా ||నీవే గానం ||