Verse 1
నా చాలిన దేవుడనీవని నిన్ను ప్రస్తుతించి
నీ నామమునే కీర్తించి ఘనపరచెదను - హోసన్న హల్లేలూయ - 4
Verse 2
ఎడారి బ్రతుకులో నీటి ఊటవై - దాహము గొన్నవేళ జీవజలమువై
అనుక్షణము నీ కృపతో పోషించు దైవమా
ఏ మంచి లేకున్న నాకై ప్రాణమిచ్చితివి
ప్రాణనాధుడా - హోసన్న హల్లెలూయ - 4 ||నా చాలిన ||
Verse 3
అగ్నివంటి మహాశ్రమలు ఎన్నినాకు కల్గినా - అన్నివేళలందున తోడునీడవౌతానని
విడువను ఎడబాయనని వాగ్ధానం చేసిన
కన్న తల్లికన్న మిన్నగ ప్రేమించిన యేసయ్య
ప్రేమమయుడా - హోసన్న హల్లెలూయ - 4 ||నా చాలిన ||