Verse 1
ఊహించిన దానికంటె - అధికముగా ఇచ్చావు
నేనడిగిన దానికంటె - ఆశీర్వదించావు
నేనడిచే మార్గ మందు - అడ్డులన్నితొలగించు
నీకరములు నాపైఉంచి - మనసారా దీవించు
Verse 2
శ్రమలలో నిన్నడిగాను - త్వరగా విడిపించావు
లేమిలో ప్రార్ధించాను ఐశ్వర్యమిచ్చావు - 2
యదార్ధముగ ఉంటేనే - అన్నీ ఇచ్చే దేవుడవని
అనుభవములో నేర్చుకున్నా - నా పద్దతి మార్చుకున్నా - 2 ||హల్లెలూయా ||
Verse 3
కష్టాలు కడగండ్లైనా - నీచేతిలో చెక్కుకుని
ఇరుకులు ఇబ్బందులైనా - నీ చంకన ఎత్తుకుని - 2
మోసేటి నాధుడనీవై - తల్లిని మరిపిస్తావు
లోకము నను మరచినగానీ - నువ్వు మరువని దేవుడవు - 2 ||హల్లెలూయా ||
Verse 4
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - 4