Verse 1
మరనాత మరనాతని ఎదురు చూచుచూ
ప్రభుయేసు రాకకై వేచియుందుము
ఇదే మరనాత శుభవార్త దళ ఆశయం
ఇదే మరనాత శుభవార్త సందేశం || మరనాత ||
Verse 2
పాపపరిహారము పొందుము
పరమ రాజ్యము చేరుకొందువు
పరిశుద్ధుల చేరుకొన ప్రభువచ్చుచుండగ
పరవశంబుతో ప్రభుని ఎదురేగెదము ||మరనాత ||
Verse 3
వేవేల దూతలతో విలసిల్లు రాజ్యము
ఆ రాజు పాలనందు ఆనందమే
ఈ రోజు నీవు యేసుచెంత చేరుము
రారాజు క్రీస్తుతో రాజ్యమేలగ ||మరనాత ||