Verse 1
నూతన దినమను వరమిచ్చితివి - నీ పద సన్నిధి ప్రణమిల్లగా
జీవాధిపతీ జీవంపు నిధి - నీవే జీవిత పెన్నిధి
Verse 2
యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు
నిన్ను నమ్మిన వారి చుట్టు నిత్యము ఉందువని - 2
సృష్టికి కర్తా నీతట్టు చేతులు చాపగనే - 2
నీ రక్షణ దండము నా తట్టు చూపి రక్షించు - 2 ||యేసయ్యా ||
Verse 3
నీతిమంతుని మార్గములో ఆపదలెన్నున్నా
అన్నిటిలోనుండి వానిని విడుదల చేసెదవు - 2
నీ దాసుల చుట్టు దూతలను కావలిగా యుంచి - 2
నీ దయగల రెక్కల నీడలో దాచి యుంచెదవు - 2 ||యేసయ్యా ||
Verse 4
తల్లి గర్భము నందు నన్ను రూపించకమునుపే
ఉన్నతమైన పనికై నన్ను ఎన్నిక చేశావు - 2
దర్శనమిచ్చి ధన్యతలు ఎన్నో చూపావు - 2
ఉన్నతుడా ఎన్నటికి కృపలో కాపాడు ||యేసయ్యా ||
Verse 5
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా