Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaadaandhakaarapu Loyalo

గాడాంధకారపు లోయలో

Gaadaandhakaarapu Loyalo

Lyricist: Kranthi Chepuri
Verse
గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో‖ 2x ‖
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి‖ 2x ‖
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే‖ గాడాంధకారపు Gaadaandhakaarapu ‖
Verse
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు‖ 2x ‖
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి‖ 2x ‖
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే‖ గాఢాంధకారపు Gaadaandhakaarapu ‖
Verse
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు‖ 2x ‖
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి‖ 2x ‖
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే‖ గాఢాంధకారపు Gaadaandhakaarapu ‖
Verse
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు‖ 2x ‖
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి‖ 2x ‖
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే‖ గాఢాంధకారపు Gaadaandhakaarapu ‖

Related Tags

WorshipComfortProtection