Verse
గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో‖ 2x ‖
యెహోవా నీవే నా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి‖ 2x ‖
ఆరాధన ఆరాధనా
నా తండ్రి నీకే ఆరాధనా‖ 4x గాడాంధకారపు ‖
Verse
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు‖ 2x యెహోవా ‖
Verse
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు‖ 2x యెహోవా ‖
Verse
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు‖ 2x యెహోవా ‖