Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaalinchi Choodaraa

గాలించి చూడరా

Gaalinchi Choodaraa

Verse
గాలించి చూడరా మేలైనది
నీలోన ఉన్నదా ప్రేమన్నది
ప్రేమన్నది నీ పెన్నిధి‖ 2x ‖
నీలోన ఉన్నదా ప్రేమన్నది‖ 2x ‖
Verse
దేవ దూతలా భాషలు దేనికి
కరుణ లేని నీ కఠిన ముఖానికి‖ 2x ‖
పైకి భక్తి కలిగినా చాలదు
ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము‖ 2x గాలించి ‖
Verse
బీదలకు ఆస్తినిచ్చి పంచినా
కార్చుటకు శరీరం మార్చినా‖ 2x ‖
రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా
రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము‖ 2x గాలించి ‖
Verse
కొండలు పెకిలించు విశ్వాసివా
గుండెలు కరిగించు సహవాసివా‖ 2x ‖
ప్రేమలేని విశ్వాసము శూన్యము
చివరికది మరో మృతము తథ్యము‖ 2x గాలించి ‖
Verse
స్వస్థపరచు వరాలున్న దేనికి
స్వస్థతయే లేదు నీకు నేటికీ‖ 2x ‖
ప్రేమలేని వరాలన్ని సున్నా
క్షేమమేదిరా నీకు రన్నా‖ 2x గాలించి ‖
Verse
గణ గణ మ్రోగెడి లోహానివా
కంచువై మ్రోగెడి మేళానివా‖ 2x ‖
డంబమెరుగదు మోగదు మేలిమి
పొంగదు ప్రేమ ఋణము తాలిమి‖ 2x గాలించి ‖
Verse
ధర్మశాస్త్రమంతటికాధారము
దశాజ్ఞలలో గొప్ప సారము‖ 2x ‖
ప్రేమయే అది యేసుని రూపము
లేనిదైతే వచ్చుఁ ఘోర శాపము‖ 2x గాలించి ‖
Verse
ప్రేమ విశ్వాసము నిరీక్షణ
ఓ ప్రియుడా నీకిచ్చును రక్షణ‖ 2x ‖
వీటిలో ప్రేమయే శ్రేష్టము
పాటించితే నీకింక మోక్షము‖ 2x గాలించి ‖

Related Tags

FaithDevotionLoveCorrection