Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaalinchi Choodaraa Melainadi

గాలించి చూడరా మేలైనది

Gaalinchi Choodaraa Melainadi

Verse
గాలించి చూడరా మేలైనది
నీలోన ఉన్నదా ప్రేమన్నది
ప్రేమన్నది నీ పెన్నిధి‖ 2x ‖
నీలోన ఉన్నదా ప్రేమన్నది‖ 2x ‖
దేవ దూతలా భాషలు దేనికి
కరుణ లేని నీ కఠిన ముఖానికి‖ 2x ‖
పైకి భక్తి కలిగినా చాలదు
ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము‖ 2x గాలించి ‖
బీదలకు ఆస్తినిచ్చి పంచినా
కార్చుటకు శరీరం మార్చినా‖ 2x ‖
రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా
రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము‖ 2x గాలించి ‖
కొండలు పెకిలించు విశ్వాసివా
గుండెలు కరిగించు సహవాసివా‖ 2x ‖
ప్రేమలేని విశ్వాసము వ్యర్ధము
చివరికది మరో మృతము తథ్యము‖ 2x గాలించి ‖
స్వస్థపరచు వరాలున్న దేనికి
స్వస్థతయే లేదు నీకు నేటికీ‖ 2x ‖
ప్రేమలేని వరాలున్న సున్నా
క్షేమమేదిరా నీకు రన్నా‖ 2x గాలించి ‖
గణ గణ మ్రోగెడి లోహానివా
కంచువై మ్రోగెడి మేళానివా‖ 2x ‖
డంబమెరుగదు మోగదు మేలిమి
పొంగదు ప్రేమ ఋణము తాలిమి‖ 2x గాలించి ‖

Related Tags

FaithDevotionLove