Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaanamu Cheyundu Sukeerthananu Yeho

గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహో

Gaanamu Cheyundu Sukeerthananu Yeho

Lyricist: William Dawson
Chorus
గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను‖ గానము ‖
Verse
తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ
జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను
జాటండి‖ గానము ‖
Verse
ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును
వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు‖ గానము ‖
Verse
పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి
ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి‖ గానము ‖
Verse
పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ
స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము
విమర్శించు‖ గానము ‖
Verse
ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు
భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు‖ గానము ‖
Verse
జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము
జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున
వసియింపండి‖ గానము ‖

Related Tags

PraiseWorshipGod