Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaayaamulan

గాయాములన్

Gaayaamulan

Lyricist: Songs Of Zion
Verse
గాయాములన్ గాయములన్
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు‖ 2x ‖
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
Verse
సురూపమైన సొగసైనా లేదు
దుఃఖ భరితుడాయెను‖ 2x ‖
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్‖ 2x గాయాములన్ ‖
Verse
మా అతిక్రమ క్రియలను బట్టి
మరి నలుగ గొట్టబడెను‖ 2x ‖
తాను పొందిన దెబ్బల ద్వారా
స్వస్థత కలిగె మనకు‖ 2x గాయాములన్ ‖
Verse
క్రీస్తు ప్రేమను మరువజాలము
ఎంతో ప్రేమించే మనల‖ 2x ‖
సిలువపై మేము గమనించ మాకు
విలువైన విడుదల కలిగె‖ 2x గాయాములన్ ‖

Related Tags

Good FridaySacrificeSuffering