Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaayambuthoa Nindaaru O Shuddha Shirasa

గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస

Gaayambuthoa Nindaaru O Shuddha Shirasa

Lyricist: Bernard Of Clairvaux
Verse
గాయంబుతో నిండారు
ఓ శుద్ధ శిరస్సా!
హా! ముండ్ల కిరీటంబు
భరించు శిరస్సా!
నీకిప్పుడు డపకీర్తి
హాస్యంబు గల్గెఁగా
కర్తా! ఘనంబు కీర్తి
ఎన్నడు గల్గుఁగా
Verse
లోకంబు భీతి నొందు
ప్రకాశపూర్ణుడా!
ఆ యూదులైన వారు
నీ మొము మీఁదను!
నాఁడుమ్మి వేసినారా?
నీ ముఖకాంతికి
సమాన కాంతి లేదు
కురూపి వైతివా.
Verse
నీవోర్చినట్టి బాధ
నా క్రూర పాపమే!
నాకోస మింత బాధ
వహించినావుగా!
దైవోగ్ర బాధ కేను
పాత్రుండ నైతిని
దృష్టించి నన్నుఁ జూఁచి
కటాక్ష ముంచుమీ.
Verse
నేఁ బాపి నైతి గాని
నన్ నీవు చేర్చుము!
నీ నిత్యయూటనుండి
మేళ్లన్ని పారును!
నీ నోరు మాధుర్యంపు
సుబోధఁ జెప్పెను
నీ పావనాత్మ మోక్ష
సుఖంబు లిచ్చును.
Verse
నా కోస మింత బాధ
వహించి నందుకు!
యధార్థమైన స్తుతి
నిత్యంబు నీదగున్
నీ నామమందు నేను
విశ్వాస ముంతును
నా యంత్యకాలమందు
నా యొద్దనుండుము.

Related Tags

Good FridayPassionLent