Verse
మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. యెషయా Isaiah 53:5
Chorus
గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
Verse
సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్
Verse
మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె
మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై
Verse
మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు
Verse
పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై
ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై
Verse
క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల
సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె