Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaayapadina Nee Cheyi

గాయపడిన నీ చేయి

Gaayapadina Nee Cheyi

Lyricist: Diyya Prasada Rao
Verse
గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా‖ 2x ‖
సిలువే నాకు విలువైనది‖ 2x ‖
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది‖ గాయపడిన Gaayapadina ‖
Verse
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి‖ 2x ‖
సురూపమైనా ఏ సొగసైనా‖ 2x ‖
లేనివానిగా నాకై మారితివి‖ గాయపడిన Gaayapadina ‖
Verse
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి‖ 2x ‖
మా రోగములు మా వ్యసనములు‖ 2x ‖
నిశ్చయముగా నీవు భరియించితివి‖ గాయపడిన Gaayapadina ‖
Verse
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది‖ 2x ‖
నీవు కార్చిన రక్తమే‖ 2x ‖
మా అందరికీ ఇల ప్రాణాధారము‖ గాయపడిన Gaayapadina ‖

Related Tags

PraiseWorshipSacrifice