Verse
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా‖ 2x ‖
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము‖ 2x ‖
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము‖ 2x గడచిన ‖
Verse
కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన‖ 2x ‖
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము‖ 2x గడచిన ‖
Verse
లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన‖ 2x ‖
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము‖ 2x గడచిన ‖