Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gadichina Kaalamanthaa Nanu

గడిచిన కాలమంతా నను

Gadichina Kaalamanthaa Nanu

Verse
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా‖ 2x ‖
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును‖ 2x గడిచిన ‖
Verse
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు‖ 2x ‖
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి‖ 2x మరో యేడు ‖
Verse
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా‖ 2x ‖
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి‖ 2x మరో యేడు ‖

Related Tags

PraiseThanksgivingNew Year